Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

సరైన తిండి, నీళ్లు కావాలి అని అడిగిన ప్రజలను పాములతో కరిపించి చంపిన యెహోవా !


దేవుడు అంటే తమకి వచ్చిన కష్టాలని మొరపెట్టుకుంటే తీర్చేవాడు అంటారు విశ్వాసులు. కానీ బైబిల్ లోని యెహోవా దీనికి పూర్తి భిన్నంగా ఉంటాడు.


ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా చెప్పుకునే యెహోవా, ఆ ప్రజలనే పాములతో కురిపించిన సందర్భం ఒకటి బైబిల్ లో కనిపిస్తుంది.
ఈజిప్ట్ లో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మంచి జీవితం అందిస్తాను అని నమ్మబలికి తీసుకొచ్చి అడవిలో ఆకలితో,దప్పికతో అలమటించేలా చేస్తాడు యెహోవా. ఆ ఘోరమైన ఆకలిని తట్టుకోలేక మీరు మాకు ఇస్తానన్న కొత్త బంగారు లోకం ఇదేనా అంటూ ప్రశ్నిస్తారు ఇశ్రాయేలీయులు. ఆక్రోశం వెళ్లగక్కుతారు.
అప్పుడు యెహోవాకు, అతని యొక్క ప్రవక్త అయిన మోసేకు విపరీతమైన కోపం వచ్చి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతారు.
ప్రమాదకరమైన పాముల్ని ప్రజల పైకి పంపిస్తాడు. పాముల కోరలకి చిక్కి కొంతమంది మరణించారు అని బైబిల్ చెప్తుంది. తనని ప్రశ్నించే ప్రజలని పాములతో కురిపించే దేవుడు బహుశా యెహోవాఒక్కడే. ఇలాంటి వాణ్ణి కరుణామయుడు అని ఎలా పిలుస్తున్నారు? అసలు ఇలాంటి వాడిని దేవుడు అని ఎలా అనగలుగుతున్నారు ?

రెఫరెన్సెస్ :1. ఆవేదన వ్యక్తం చేసిన ఇశ్రాయేలు ప్రజలు
కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. (సంఖ్యాకాండము 21:5)
2. పాము కాటుకి బలైన ప్రజలు
అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. (సంఖ్యాకాండము 21:6)
3. చావు భయంతో యెహోవా/మోసే కాళ్లపై పడిన ప్రజలు
కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.(సంఖ్యాకాండము 21:7)
4. కోపం తగ్గి, ఉపశమనం చెప్పిన యెహోవా
సంఖ్యాకాండము 21:8
మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
ఇప్పుడు చెప్పండి .. ఇలా ప్రజలని చంపి, భయపెట్టి దార్లోకి తెచ్చుకునే వాడిని కరుణామయుడు అంటారా? ఆకలితో అన్నం, నీళ్లు అడిగేవాళ్ళని పాములతో కరిపించి చంపేవాడు దేవుడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *