బైబిల్లో దేవాదాసి వ్యవస్థ (రుజువులతో సహా ) TEMPLE PROSTITION IN BIBLE TELUGU

Temple Prostitution in Bible with proofs

  1. దేవదాసి అనుకొని కోడలితో వ్యభిచారం చేసిన యూదా
  2. ముసుగుకి దేవదాసి వృత్తికి ఉన్న సంబంధం – కోర్ట్ కేసు
  3. దేవదాసీలతో వ్యభిచారానికి యెహోవా ప్రోత్సాహం

దేవదాసి అనుకొని కోడలితో వ్యభిచారం చేసిన యూదా

సందర్భం – వివరణ

యూదా మొదటి కొడుకు భార్య అయిన తామారు, తన భర్త యెహోవా చేతిలో చనిపోవడంతో రెండో భర్తని పెళ్లాడుతుంది. ఆటను కూడా యెహోవా చేతిలో చనిపోవడంతో మూడో పెళ్ళికి సిద్ధం అవుతుంది. కానీ యూదా మూడో కొడుకు ,తామారు మరిది ఇంకా చిన్న పిల్లడు కావడంతో ఆమెను పుట్టింటికి పంపించేస్తాడు యూదా. కొంత కలం తరవాత యూదా భార్య చనిపోవడంతో మామపై కన్నేసిన తామారు దేవదాసి రూపంలో( ముసుగు ధరించి) మామకు ఎదురుపడి, బేరం కుదుర్చుకుని అతనితో సెక్స్ చేసి గర్భవతి అవుతుంది. ఆమెకు మామ ద్వారా ఇద్దరు మగపిల్లని కంటుంది.

మామ కోడలిని వేశ్యగా ఎలా గుర్తించాడు ?

యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక – నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె-నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. (ఆదికాండము 38:15-16)

“ఇక్కడ ఆమె తన ముఖము కప్పుకొనినందున” ఆమెను వేశ్య అనుకున్నాడు అని ఉంది.
కాబట్టి వేశ్యలకు ముఖం పై ముసుగు ధరించడం వేశ్యలు అనడానికి ప్రత్యేక గుర్తింపు అని అర్ధం అవుతోంది.

ఇక్కడ ఆదికాండము 38:15 తామారు గురుంచి చెప్తూ హెబ్రీ భాషలో לְזוֹנָ֑ה lə-zō-w-nāh;(harlot ) అని పదాలు వాడారు. అంటే వేశ్య అని అర్ధం. అంటే తామారు మామగారు ఆమెను వేశ్య అనుకున్నాడు అని అర్ధం అవుతోంది. ముసుగు ధరించడం వల్లనే యూదా ఆమెను వేశ్య అని గుర్తించాడు.

తామారు దేవదాసి /వేశ్య అని చెప్పగలం?

కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య (దేవాదాసి) (qə-ḏê-šāh) యెవతెయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా-మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచు కొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను.
(ఆదికాండము 38:22-23)

So he went back to Judah and said, “I didn-t find her. Besides, the men who lived there said,`There hasn-t been any shrine-prostitute here. (NIV) (Genesis 38:22)

https://biblehub.com/text/genesis/38-22.htm

qə-ḏê-šāh అనే హెబ్రీ పదాన్ని ఇక్కడ వాడారు. ఆ పదానికి temple prostitute / shrine prostitute / గుడిసాని/దేవదాసి అని అర్ధం.

ఈ పదం హెబ్రీ బైబిల్ అనేక సందర్భాల్లో ఇదే అర్ధంలో ఉపయోగించబడింది.
https://biblehub.com/hebrew/kedeshah_6948.htm

యూదాకి దేవదాసీలు దగ్గరకి వెళ్లే అలవాటు ఉందని తామారుకి ఎలా తెలుసు ?

మామగారి అలవాట్లు కోడలికి తెలియడం పెద్ద విచిత్రం కాదు. మామ గారు తరచూ ఆ దారిలో ప్రయాణించి,ఎలాంటి పనులు చేస్తాడో తెలిసే తామారు దేవదాసి/ వేశ్య వేషంలో అక్కడకి పోయి మాటు వేసింది. మామతో సెక్స్ చేసింది.

  1. ముసుగుకి దేవదాసి వృత్తి కి ఉన్న సంబంధం ఏమిటి? ముసుగుకి దేవదాసి వృత్తికి ఉన్న సంబంధం – కోర్ట్ కేసు Muazzez İlmiye Çığ అనే మహిళా Turkey దేశపు మహిళా historian రాసిన My Reactions as a Citizen అనే పుస్తకంలో ముసుగు వేసుకున్న స్త్రీలు దేవదాసీలు అంటూ ఆమె చేసిన ప్రస్తావనకు గాను ఆమెపై కోర్టులో కేసు పడింది. అప్పుడు ఆమె తాను కనుగొన్న విషయాలను కోర్ట్ కి తెలుపగా ఆమె దర్జాగా గెలిచి బయటకు వచ్చింది. ఆమె ఏమంటున్నారంటే ఒకప్పుడు ఇజ్రాయెల్,ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతలో ఆలయాల్లో పనిచేసే స్త్రీలలో దేవదాసీలు,మిగతా స్త్రీలకూ తేడా తెలియడం కోసం ముసుగు అనే అలవాటుని ఉపయోగించేవారు అని చెప్పుకొచ్చారు.

సాధారణంగా ఆలయాల్లో పనిచేసే ఉత్తమ స్త్రీలు ముసుగు లేకుండా ఉండేవారనీ, దేవదాసీలు/వేశ్యలు ఆలయాల్లో ముసుగు ధరించేవారు అని Muazzez İlmiye Çığ తన పుస్తకంలో / తరవాత కోర్ట్ లో నిరూపించారు.

దీనిపై అనుమానం ఉన్న వాళ్ళు Muazzez İlmiye Çığ గురుంచి తెలుసుకుంటే మంచిది.

కాబట్టి ముసుగు వేసుకోవడం దేవదాసీలకు ప్రత్యేక గుర్తింపు అని అర్ధం అవుతోంది. అందుకే యూదా ముసుగు ధరించిన స్త్రీని వేశ్యగా గుర్తించగలిగాడు .

  1. యెహోవా దేవదాసీలతో పాడుకోవడాన్ని సమర్ధించాడా ?

ఖచ్చితంగా అవును అనే చెప్పాల్సి వస్తోంది.

ఇక్కడ యూదా కథలో యెహోవా రెండు చోట్ల కనిపిస్తాడు. మొదటి సారి యూదా మొదటి కొడుకుని చంపుడం లోను, రెండో సారి రెండో కొడుకుని చంపడంలోనూ. యెహోవా స్వయంగా ఈ రెండు చోట్ల కల్పించుకుని మనుషులని చంపాడు. యూదా కొడుకులు తప్పు చేస్తున్నారని వాళ్ళని చంపినా యెహోవా, అదే కుటుంబంలోని యూదా ఆటను కోడలు సెక్స్ చేస్తూ ఉంటే కనీసం మధ్యలోకి వేలుకూడా పెట్టలేదు. యూదా రెండో కొడుకు వీర్యం నేలపై వేస్తున్నాడని అతన్ని చంపిన యెహోవా, యూదా తన కోడలితోనే సెక్స్ చేస్తుంటే ఎందుకు కలగా జేసుకోలేదు ?

యూదా రెండో కొడుకు వీర్యం నేలపాలు చేయడం కంటే, యూదా కోడలితో వీర్య స్కలనం చేయడం యెహోవా దృష్టిలో తప్పు కాదా?

యెహోవా దృష్టిలో ఇది తప్పు అయితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి ఉండేవాడు. కానీ ఇక్కడ యెహోవా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. అంటే యెహోవాకు ఇది అఆమోదమే అని అర్ధం అవుతోంది కదా !

పైగా యూదా ఇద్దరి కొడుకుల్ని యెహోవా చంపడం వల్లనే కథ ఇంత వరకు వచ్చింది. కాబట్టి ఇదంతా యెహోవా కనుసన్నల్లోనే జరిగింది అనడంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు.

పోస్ట్ పొడవు పెరుగుతున్న కారణంగా ఇక్కడతో ముగిస్తున్నాను.

పోస్ట్ పై మరింత అవగాహన కోసం నా పాత పోస్ట్ లు కూడా చదవండి.

సెలవు …మీ రమణ నేషనలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *