
బైబిల్ దైవ గ్రంథం అంటారు కదా. ఖచ్చితంగా సింగల్ లైన్ సమాధానం దొరకొచ్చు ఏమో చూద్దాం.
నా ఫేస్బుక్ పేజీలోకి రోజూ ఎందరో మూర్ఖులు వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కామెంట్స్ చూసి నేనేదో సమాధానం చెప్తాను. వాళ్ళు ఇంకేదో కామెంట్స్ చేస్తారు. అలాంటి మూర్ఖులతో వాదించి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు రమణ ? అని కొందరు మిత్రులు నాకు సలహా ఇస్తారు! ఇది రోజూ ఉండే గొడవే.
కానీ ఏం చేయమంటారు? బైబిల్ చదివిన అందరిదీ ఇదే సమస్య.
మూర్ఖులతో వాదించాలా వద్దా?
- మూర్ఖులతో వాదించకు – బైబిల్ సలహా
వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము. ఇచ్చినయెడల నీవును వాని పోలియుందు. (సామెతలు 26:4)
మూర్ఖులతో వాదించకు. వాళ్ళతో వాదిస్తే వాదిస్తే నువ్వు కూడా మూర్ఖుడివే అవుతావు అని ఇక్కడ మన బైబిల్ జ్ఞాన బోధ చేస్తుంది.
అబ్బా ఎంత గొప్ప వాక్యం !
ఈ వాక్యం చదివి ఇక జీవితంలో మూర్ఖులతో వాదించకూడదు అని ఫిక్స్ అయిపోతే బాగుండేది. కానీ నా కళ్ళు ఆ తరువాతి వచనం మీద పడ్డాయి.
మూర్ఖుడితో వాదించు – లేకపోతే వాడే గొప్ప అనుకునే ప్రమాదం ఉంది
వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.(సామెతలు 26:5)
అందుకే నాకు ఒళ్ళు మండేది.
ఇంతక ముందే కదా, మూర్ఖుడితో వాదించకు. వాదిస్తే వాడికి నీకు తేడా ఏముంటది అని నీతి కబుర్లు చెప్పింది. ఒక్క వచనం గ్యాప్ లో మూర్ఖుడితో వాదించాలి అని సలహా ఇస్తోంది ఏమిటి? దీనికి ఏమైనా మెంటల్ హా? అనిపిస్తుంది.
మొదటి వాక్యం ప్రకారం వాదిస్తే తప్పు. రెండో వాక్యం ప్రకారం వాదించకపోతే తప్పు. ఇలాంటి గజిబిజి బైబిల్ ని ఎమ్ అనాలి?
అందుకే ఎవరు చెప్పినా వినకుండా, ఈ నా పేజీ లోని మూర్ఖులతో వాదించుకుంటూ పోతున్నా. లేకపోతే గంటలు, గుంటలూ వారే గొప్ప అనుకునే ప్రమాదం ఉంది. అంటే రెండో వచనం అన్నమాట. నేను మొదటి వాక్యాన్ని పాటించకపోతే ఏదైనా పాపమా? ఏమో !
మొదటి బైబిల్ వాక్యం పాటించే వాళ్ళు వాదన చెయ్యకూడదు. రెండో వాక్యం పాటించే వాళ్ళు మూర్ఖులతో వాదన చెయ్యొచ్చు.
బైబిల్లో రెండు వాక్యాలూ పక్కపక్కనే ఉన్నాయి. రెండూ పరిశుద్ధ ఆత్మ రాయించినవే. కానీ పరిశుద్ధ ఆత్మకి సరైన క్లారిటీ లేదు.
ఇంతకీ మూర్ఖులతో వాదించాలా ? వద్దా ? మీ అభిప్రాయం ఏమిటి?
మీరు ఏ బైబిల్ వాక్యాన్ని సపోర్ట్ చేస్తారు?