మా దేవుడు కరుణామయుడు నమ్మరేంట్రా బాబు.. నమ్మండి!!!
క్రైస్తవులు తమ దేవుడు ఎంతో కరుణామయుడు అని మీ దగ్గరకి వస్తే వాళ్ళకి ఈ కథ చెప్పండి. ఇంకెప్పుడు వాళ్ళ దేవుడు కరుణామయుడు అని చెప్పే సాహసం చెయ్యరు.
ఎలీషా ప్రవక్త ఒక సారి ఒక ఊరు దాటి వెళతూ ఉంటే ఆ దారిలో ఆటలు ఆడుకుంటున్న కొందరు పిల్లలు అతన్ని బట్టతల వాడా అని..కామెంట్ చేస్తారు. అంతే.
ప్రవక్త అయిన ఎలీషా గారికి కోపం వచ్చి దేవుని నామంలో శపించేస్తాడు. 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి ఆ పిల్లల్ని చంపేస్తాయి. ఇది క్లుప్తంగా కథ. దీనిని బట్టి యెహోవా ఎంత కరుణామయుడో అర్థం చేసుకోండి.
ఇంతటి కరుణాసముద్రుడు ఎక్కడైనా ఉంటాడా?
అందుకే అంటారు బైబిల్ దేవుడు కరుణామయుడు అని. నమ్మరరేంట్రా బాబు… నమ్మండి!!!
రిఫరెన్స్:
అక్కడనుండి అతడు(ఎలీషా) బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చిబోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను. (2 రాజులు 2:23-24).
ఇప్పటికైనా బైబిల్ దేవుడు కరుణామయుడు అంటే నమ్మరరేంట్రా బాబు… నమ్మండి!!!
తన కొడుకుని మనకోసం బలిచ్చేశాడు అంటే నమ్మరరేంట్రా బాబు… నమ్మండి!!!
http://ramananationalist.blogspot.com/2021/07/two-bears-kills-42-children-bible-story.html
2:23 వీళ్ళు పసివాళ్ళు కాదు. యోసేపుకు పదిహేడేళ్ళ ప్రాయమప్పుడు అతణ్ణి గురించి ఇదే హీబ్రూ పదం వాడడం జరిగింది (ఆది 37:2). అబ్‌షాలోం పెద్దవాడయ్యాక కూడా ఇదే పదం వాడారు (2 సమూ 18:5). 24వ వచనంలో మరో హీబ్రూ పదాన్ని అబ్బాయిలు అని అనువదించారు. ఈ పదాన్ని దాని 1:4, 10, 13, 15, 17లో దానియేలు, అతని స్నేహితుల విషయంలో వాడారు. ఈ యువకులు ఎలీషాను ఇలా గేలి చెయ్యడం అతడు, ఏలీయా దేనికోసం నిలబడ్డారో దానిపట్ల, వారి దేవుని పట్ల నీచమైన తిరస్కార భావాన్ని బయట పెడుతున్నది. ఈ సంఘటన జరిగిన బేతేల్ యరొబాం ప్రవేశపెట్టిన భ్రష్ట మతానికి కేంద్రం (1 రాజులు 12:32-33; ఆమోసు 7:13).