ద్రాక్ష పండ్లు (grapes) తినొద్దు అంటున్న యెహోవా
అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు. (సంఖ్యాకాండము 6:4)
యెహోవాకి నాజీరైన మనిషి ( దీక్ష/మాల ధారణకి సమానం) ద్రాక్షపల్లు ఎందుకు తినకూడదు? బైబిల్ పరిభాషలో ద్రాక్ష రసం అంటే మద్యం కాకపోతే యెహోవా ద్రాక్ష పండ్ల నుండి వచ్చే యే పదార్ధాన్ని కూడా తీసుకోవద్దని, ఆఖరికి పచ్చి ద్రాక్ష పండ్లను కూడా తినవద్దు అని ఎందుకు చెప్పాడు?
(ఈ నాజీరు అనే కాన్సెప్ట్ అర్ధం కావాలంటే పోస్ట్ ఆఖరిలో పెట్టే లింక్ చూడండి)
బిబిల్లో ద్రాక్షరసం చేయించిన ఘోరాలు చూడండి.
- నోవా వేసిన ద్రాక్ష తోట
ద్రాక్ష తోట – ద్రాక్ష రసం – మత్తు
నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. (ఆదికాండము 9:20-22)
Noah, a man of the soil, proceeded to plant a vineyard. When he drank some of its wine, he became drunk and lay uncovered inside his tent. Ham, the father of Canaan, saw his father’s nakedness and told his two brothers outside.(Genesis 9:20-23)
ఇక్కడ నోవా ఏం తాగి ఒళ్ళు తెలియకుండా, వివస్త్రుడై ఉన్నాడు?
సమాధానం: ద్రాక్షరసం ( wine)
ఎందుకు తయారుచేశాడు ద్రాక్షరసం (WINE)?
తాను సేవించడానికి మరియు యెహోవా కు దహన బలిలో పానార్పణము కొరకు (డ్రింక్ ఆఫరింగ్ ).
- ద్రాక్షరసం – లోతు కూతుళ్లు – తండ్రితో సెక్స్
ఊరు మొత్తం తగలపడిపోయింది, ఒక పక్క తల్లి కూడా చచ్చిపోయింది. అయినా సరే పిల్లలని కనడమే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు, ఎవడూ దొరకానట్టు, వేరే మగాడే దొరకనట్టు, ద్రాక్షరసం పోసి మరీ తండ్రితో సెక్స్ చేసి పిల్లల్ని కన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. లోతు కూతుళ్ళకి ద్రాక్ష రసం ఎక్కడ నుండి దొరికింది ? ఇది మరొక ఎత్తు?
ద్రాక్షరసం ఎక్కడ నుండైనా తెచ్చుకున్నారు? లేక సొదొమ గోమారియ నుండి వచ్చేటప్పుడే ఒక బాటిల్ తెచుకున్నారా ?
ఏదేమైనా ద్రాక్షారసం తాగించడం వల్లనే తండ్రితో సెక్స్ అనే ఘట్టం ముగిసింది అన్నది అందరికి తెలిసిన విషయమే.
రెఫరెన్సెస్: ఆదికాండము 19:32-38
మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.(ఆదికాండము 19:32)
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి. (ఆదికాండము 19:36)
ఇక్కడ ద్రాక్షరసం తాగితే ఏం జరిగిందో చూశారు కదా ! కాబట్టి మద్యం తాగడం అన్నా ద్రాక్షరసం తాగడం అన్నా ఒక్కటే అని అర్ధం చేసుకోవాలి . గ్రేప్ జ్యూస్ తాగి కూతుళ్లతో సెక్స్ చేయడం బయట ఎప్పుడైనా చూశారా? కాబట్టి ద్రాక్షరసం అన్నా మద్యం అన్నా ఒక్కటే !
మరో సందర్భంలో యేసు ద్రాక్షరసం సప్లై చేస్తాడు . అతని తల్లి కూడా ద్రాక్షరసం సప్లై చేస్తారు. అది కేవలం గ్రేప్ జ్యూస్ అనుకుంటే అది మీ ఇష్టం . పైగా అందరి కంటే యేసు పంచిన ద్రాక్షారసమే “నిఖార్సైన సరుకు” అని కితాబు కూడా ఇచ్చారు.
అందరూ తాగాలని బాగా పలచని ద్రాక్షరసం(జబ్బురసము) ఇస్తారు. నువ్వు స్టాక్ దగ్గర పెట్టుకున్నట్టు ఉన్నావు. ఉత్తమ సరుకు పోసావు ప్రభువా ! అంటున్నారు.
ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.(యోహాను 2:10)
and said, “Everyone brings out the choice wine first and then the cheaper wine after the guests have had too much to drink; but you have saved the best till now.”
ఇవన్నీ సరే అండీ ..!
మొదట నాకు ఒక డౌట్ క్లియర్ చేయండి. ద్రాక్ష పళ్ళు తింటే తప్పేమిటి ?
నాజీరు ద్రాక్ష పళ్ళు ఎందుకు తినకూడదు ?
“నాజీరు – ద్రాక్ష పళ్ళు”
https://www.facebook.com/106914574790243/posts/258394592975573/