Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

ABRAHAM AND JESUS ARE ONE GUY?

శారా కు కదుపుచేసిన త్రిమూర్తులు ఎవరు?

నేను బైబిల్ చదివిన ఇంతకాలానికి ఒక కొత్త విషయాన్ని కనిపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అది నా మిత్రులు అయిన మీతో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది.
వేదాల్లో యేసు ఉన్నట్టు కనుగొన్న రంజిత్ ఓఫిర్ గారి స్పూర్తితో బైబిల్లో త్రిమూర్తులని కనిపెట్టగలిగాను.
ఆ త్రిమూర్తులు హిందూ పురాణాల్లోని త్రిమూర్తులా ? లేక బైబిలులోని త్రిమూర్తులా అనేది మీరే చదివి తెలుసుకోండి.
షార్ట్ స్టోరీ
1. బైబిలులోని ఆదికాండము 18 వ అధ్యాయం 1 వ వచనంలో యెహోవా అబ్రహాము అనే వాడికి కనిపిస్తిస్తాడు. ఆ విషయం బైబిల్లో స్పష్టం గా ఉంది. 2. త్రిమూర్తులు (ముగ్గురు వ్యక్తులు) అబ్రాహాముకి సాక్షాత్కరిస్తారు. వాళ్లలో యెహోవా కూడా ఉన్నాడు అని బైబిల్ చెప్తోంది. మరో ఇద్దరు బహుశా యేసు మరియు పరిశుద్ధ ఆత్మ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 3. ఆ ముగ్గురు అబ్రాహాము ఇంట్లో భోజనం చేసి, కళ్ళు కడుక్కొని, అబ్రాహాము ఆతిధ్యానికి మెచ్చుకొని నెక్స్ట్ ఇయర్ మేము నేను మళ్ళీ వస్తాను . అప్పుడు నీ భార్యకి పండంటి మగబిడ్డ పుడతాడు అని వరం ఇస్తాడు . 4.చెప్పినట్టు గానే యెహోవా శారాను దర్శించి (గాడ్ visited శారా ) ఆమెకు గర్భఫలమ్ అందిస్తాడు. పర్సనల్ గా వచ్చి మీట్ అయ్యి వరం ఇచ్చాడు కాబట్టి 100 ఏళ్ళ అబ్రాహాముకి గర్భం దాల్చే వయసు దాటిపోయి చాలా కాలం అయిన శారాకు మగబిడ్డ పుట్టాడు.
కాబట్టి అబ్రాహాము భార్యకు కడుపు చేసింది త్రిమూర్తులలో ఒకడైన యెహోవా అని బైబిల్ చెప్తోంది.
అయితే కొత్త నిబంధన ప్రకారం యేసు ఒక్కడే యెహోవాను చూసి ఉన్నాడు . అలా అయితే యేసు, అబ్రాహాము ఒక్కరే అయ్యుండాలి. లేకపోతే బైబిల్ తప్పు అయిపోతుంది .
కాబట్టి యేసు జన్మలో అబ్రాహాము అని , అబ్రాహాము (యేసు) భార్యకు యెహోవా కడుపు చేసాడు అని అనుకోవాల్సి వస్తోంది.
ఇది ఇలా ఉంచితే , ఈ త్రిమూర్తులు క్రైస్తవ త్రిమూర్తులా ? లేక హిందూ త్రిమూర్తులా అన్నది ఒక ప్రశ్న. హిందూ త్రిమూర్తులు అయ్యే అవకాశం కూడా ఉంది .
ఆదికాండము 18:1మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.ఇక్కడ సిందూర వనం అని place కాశ్మీర్ (సిందూరవనం = కుంకుమ పూలతోట ) అనుకుంటే , బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు మానవ రూపంలో వచ్చి అబ్రాహాము భార్యకి కడుపు చేసి ఉండాలి .
బ్రహ్మ భార్య సరస్వతి . అబ్రాహాము భార్య శారా .
ఈ పేర్లు చూడండి ఎంత బాగా కలిశాయో .
అంటే భ్రహ్మ సరస్వతికి కడుపు చేయడం అనే విషయమ నిజమని క్రైస్తవులు వాదిస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ సరస్వతి (శారా ) కు కడుపు చేసింది బ్రహ్మ దేవుడే . ఆయనే సృష్టి కర్త . బైబిల్లో సృష్టి కర్త యెహోవా కాబట్టి యెహోవా శారా కి కడుపు చేశాడు అనుకోవచ్చు.
ఈ విధంగా ఆలోచిస్తే బాబిల్ అనేది హిందూ గ్రంధాలను కాపీ చేస్తూ రాసుకున్నారని అర్ధం అవుతోంది .
ఇలా ఎన్నో ఆలోచనలు , ఊహలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి . ఇలా అయితే వేదాల్లో యేసు పుస్తకానికి కౌంటర్ గా మరో క్రైస్తవ హైందవం రాసేయొచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ .
రెఫరెన్సెస్ :
Part-1
1.
ఆదికాండము 18:1మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
vs
యోహాను 6:47దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.
ఆదికాండము 18: 2అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
ఆదికాండము 18: 3ప్రభువులారా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు.
ఆదికాండము 18: 4నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.ఆదికాండము 18:5కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగాఆదికాండము 18:6అబ్రాహాము గుడారములో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను.
ఆదికాండము 18:9వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను
ఆదికాండము 18:10అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
PART-2
ఆదికాండము 21:1
యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.
Genesis 21:1And the LORD visited Sarah as He had said, and the LORD did unto Sarah as He had spoken.
కాబట్టి యెహోవా VISIT చేయడం వల్లనే స్పెషల్ దర్శనం ఇవ్వడం వల్లనే శారా అనబడే అబ్రాహాము భార్యకి కడుపు వచ్చింది అనుకోవాల్సి వస్తోంది.
అలాగే యేసు ఒక్కడే యెహోవాను చూశాడు కాబట్టి యేసు భార్య అబ్రాహాము భార్య శారా అని నిర్ధారించి యెహోవా అబ్రాహాము భార్యకు యెహోవా కడుపు చేశాడు అని అనుకోవాల్సి వస్తుంది .
త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ (యెహోవా ) శారా కి కడుపు చేశాడు అనుకోవాల్సి వస్తుంది .
వేదాల్లో యేసు ఉన్నట్టే , యెహోవా కూడా పురాణాల్లో ఉన్న కొందరిలా ఆడాళ్లకి కడుపులు చేశారు అనుకోవాల్సి వస్తోంది .
……
గమనిక : వేదాల్లో యేసు (HAINDAVA KRAISTAVAM) అన్న పుస్తకాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఇలాంటి కౌంటర్ లు యెహోవా పేరిట /యేసు పేరిట తప్పవు అని రంజిత్ ఓఫిర్ మినిస్ట్రీస్ ను హెచ్చరించడమైనది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *