Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

యేసు చెప్తున్న తండ్రి యెహోవా కాదా? యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.(యోహాను 2:13-16) Vs జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. (అపో. కార్యములు 17:24) "The God who made the world and everything in it is the Lord of heaven and earth and does not live in temples built by hands. (Acts 17:24)

బైబిల్ తెలియని చాలా మందికి యేసు పదే పదే చెప్పే “నా తండ్రి.. నా దేవా” లాంటి పదాలు వినినప్పుడు అవి యెహోవా గురుంచే అయ్యుంటాయి అనుకుంటారు. ఎక్కువ శాతం అలానే ఉంటాయి కూడా.

కానీ అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఈయన చెప్పే మాటలు యెహోవా గురుంచి కాకపోవచ్చు కదా అని.

అలాంటి ఒక సందర్భం ఇప్పుడు చూద్దాం. కరుణామయుడు అయిన మన యేసు క్రీస్తు వారికి ఒక్క సందర్భంలో బాగా కోపం వచ్చింది. పస్కా పండుగ రోజున జంతుబలి కోసం, జంతువులని అమ్మే అంగడిలో యేసు ఏం చేసాడో ఇక్కడ చదవండి.

యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.(యోహాను 2:13-16)

When it was almost time for the Jewish Passover, Jesus went up to JerusalemIn the temple courts he found men selling cattle, sheep and doves, and others sitting at tables exchanging money. So he made a whip out of cords, and drove all from the temple area, both sheep and cattle; he scattered the coins of the money-changers and overturned their tables. To those who sold doves he said, “Get these out of here! How dare you turn my Father-s house into a market!” ( John 2:13-16)

ఇందులో యూదులు చేసిన తప్పేమిటి? యెహోవా గుళ్లో వ్యాపారం చేయడం యేసుకి నచ్చలేదు అని క్రైస్తవులు సమాధానం చెప్తారు. యేసుకి నిజంగా ఇందుకే కోపం వచ్చిందా?ఒకసారి ఈ వాక్యం చూడండి. “నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.(యోహాను 2:16)”

ఐతే క్రైస్తవులు చెప్పే మాట నిజమే. అంటే యెహోవా ఆలయం బైబిల్ దేవుడికి ఇల్లు అన్నమాట!OK .

ఇల్లు అంటే తెలుసుకదా! నివాస స్థలం. అంటే బైబిల్ దేవుడు ఈ గుళ్లో ఉంటున్నాడు కాబట్టి ఈ ఆలయం “యెహోవా ఇల్లు” అని యేసు అభిప్రాయం అయ్యుండాలి అవునా?అయితే ఒకసారి పాతనిబంధన తిరగేయండి. నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి. (నిర్గమకాండం 25:8-9)

అలాగే (దానియేలు 5:3) చూడండి.

అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా… (దానియేలు 5:3)

రెండు చోట్లా, ఆ ఆలయం యెహోవాకు నివాస స్థలం అంటే ఇల్లు అనే ఉంది కదా?.

తానెంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లు అని కూడా అర్ధం వస్తోంది కదా అని నాపై కోప్పడకండి. నన్ను కాసేపు క్షమించి, ముందుకు చదవండి. మీ మాట ప్రకారం, యేసు తన తండ్రి ఇంటిని పాడుచేస్తున్నారన్న కారణం చేతనే యూదులపై కోప్పడ్డాడుఅని ఒప్పేసుకుంటాను.

పై రెండు బైబిల్ వాక్యాల ప్రకారం, తన నివాస స్థలం (తన ఇల్లు) అక్కడ ఉన్న ఆలయమే అని మనకు తెలుస్తోంది . ఐతే యేసు ఇక్కడ ఎవరినైతే తండ్రి అంటున్నాడో అతను యేసుకి తండ్రి అయుండాలి. అతను యెహోవానే అయ్యుండొచ్చు కూడా. కాబట్టి యెహోవా తన ఇంట్లో ఉంటాడు అని, ఆ ఇంటిని ఎవరైనా పాడు చేస్తే యేసుకి కోపం వస్తుంది అని మనం భావించాలి.

ఇంకొంచెం చదవండి. లాస్ట్ కి వచ్చేసాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. (అపో. కార్యములు 17:24)”

The God who made the world and everything in it is the Lord of heaven and earth and does not live in temples built by hands.(Acts 17:24)

ఈ వాక్యం ప్రకారం దేవుడు అనే వాడు మనుషులు కట్టిన భవనాల్లో,నిర్మాణాల్లో నివసింపడు అని ఉంది. మరి ఇంతక ముందు యెహోవా ఇల్లు అని ఒక ఆలయం గురుంచి చెప్ప్పుకున్నాం కదా !

పాత నిబంధనలో కూడా ఆ యెహోవా గారి ఇల్లు ( నివాస స్థలం) ప్రస్తావన ఉంది కదా !ఆఖరి వచనంలో ఏమిటి? రివర్స్ లో ఉంది?అంటే యేసుకి ఒక తండ్రి ఉన్నాడు అతను గుళ్లో నివాసం ఉంటాడు.పాత నిబంధన కాలంలో కట్టబడిన ఆలయంలో కూడా ఒక దేవుడు నివాసం ఉండేవాడు. తన వస్తువుల్ని ఎవరైనా ముట్టుకుంటే కోప్పడే వాడు.

అతనే ఒకవేళ యెహోవా అయితే

మానవులు నిర్మించిన ఆలయాల్లో నివసింపని ఆ మరో దేవుడు ఎవరు?

ఒక చోట నివాస స్థలం కావాలని అడిగిన దేవుడు, మనుషులు కట్టే ఆలయాల్లో నివసింపని దేవుడు ఒక్కరే అయ్యే అవకాశం లేదు కదా !

బాగా ఆలోచించి, నాకు సమాధానం చెప్పండి

మీ

రమణ నేషనలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *