బైబిల్ దేవుడు ఒక్కో సారి తనకు కావాల్సిన గౌరవ మర్యాదల కోసం, బలుల కోసం ఇజ్రాయెల్ వారిని ఎంతో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. ఆయనకు ఇవ్వబడే జంతుబలులలో "క్వాలిటీ" మైంటైన్ చెయ్యకపోతే ఆయనకు అస్సలు నచ్చదు. జంతు బలిలో క్వాలిటీ తగ్గితే యెహోవా మాట తీరు ఎలా ఉంటుందో ఈ కింద రెఫరెన్సెస్ లో చూడండి
కుంటి దానిని స్వీకరించను:
అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బలులను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడినదానిని, కుంటిదానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు. (మలాకీ 1:13)
నేను మహారాజుని.. నాకు మచ్చలేని మగ గొర్రెలే కావాలి..!
నేను ఘనమైన మహారాజునైయున్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. (మలాకీ 1:14)
And you say,` What a burden!- and you sniff at it contemptuously,” says the LORD Almighty. “When you bring injured, crippled, or diseased animals and offer them as sacrifices, should I accept them from your hands?” says the LORD. (Malachi 1:13)
“Cursed is the cheat who has an acceptable male in his flock and vows to give it, but then sacrifices a blemished animal to the Lord. For I am a great king,” says the LORD Almighty, “and my name is to be feared among the nations. (Malachi 1:14)
భక్తులు ఇచ్చే ఫలమో పత్రమో స్వీకరించి వరాలు ఇచ్చిన దేవుళ్ళని చూసి ఉంటారు. ఇలా బలుల కోసం ఇబ్బంది పెట్టే దేవుళ్ళని ఎవరైనా, ఎప్పుడైనా చూశారా?
నాకు ఇలాంటి బలే కావాలి. క్వాలిటీ తగ్గితే ఒప్పుకోను అనే దేవుడుగా యెహోవా రికార్డుని ఎవరైనా చెరపగలరా ?