Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

లోపం కలిగిన పాత నిబంధన /యెహోవా ధర్మశాస్త్రమునందు ఎలా ఆనందించాలి?

యూదులకు పాత నిబంధన పేరుతో యెహోవా ధర్మ శాస్త్రం ఇచ్చిన దేవుడు అది లోప భూయిష్టంగా ఉంది అని హీబ్రూ పత్రికలో ఒప్పుకున్నాడు. కానీ అదే దేవుడు అంతక ముందు తాను ఇచ్చిన ధర్మ శాస్త్రంతో ఆనందించి, దానినే దివారాత్రులు (ఎల్లప్పుడూ) ధ్యానించమని, అలా ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పాడు.

అది లోప భూయిష్టమైన ధర్మ శాస్త్రం అని నువ్వే చెప్పి దానితోనే ఆనందించమంటే ఎలా ప్రభువా?

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. (కీర్తనల గ్రంథము 1:1-2)

vs

ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. (హెబ్రీయులకు 8:7)

అంటే ఇన్నాళ్లు మాకు నాసిరకం ప్రోడక్ట్ అంటగట్టావా ప్రభువా ?

అని యూదులు బాధపడరా? కొత్త నిబంధనను తిరస్కరించడానికి ఈ ఒక్క కారణం సరిపోదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *